Kukunoor: బీసీ గర్జనకు కుక్కునూరు నుంచి తరలిన వైఎస్సార్‌సీపీ నేతలు!

Kukunoor: రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'బీసీ గర్జన'కు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నుంచి బీసీ నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Sept 2026 10:12 AM IST
Kukunoor
X

Kukunoor: బీసీ గర్జనకు కుక్కునూరు నుంచి తరలిన వైఎస్సార్‌సీపీ నేతలు!

Kukunoor: రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “బీసీ గర్జన” కార్యక్రమానికి కుక్కునూరు మండలం నుంచి బీసీ నాయకులు తరలివెళ్లారు. మండల పార్టీ అధ్యక్షుడు తాండ్ర రాజేష్ ఆదేశాల మేరకు నాయకులు బయలుదేరినట్లు పోలవరం నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు మల్లేలా చంటి నాయుడు తెలిపారు.

బీసీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభుత్వ విధానాలను ఆయన విమర్శించారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ పోరాడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో పగిల్లా అనిల్, అద్దనపు రాము, గూడపాటి ప్రభాకర్, మాచవరం నాని, వేముల వినయ్ కుమార్, పొలాగాని రాంబాబు, నిమ్మల ప్రసాద్, ఆది శ్రీను తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్