Bhadrachalam: అంగన్‌వాడీ ఆయా పోస్టులకు ఇంటర్య్వూలు - సీడీపీఓ విజయ కుమారి!

Bhadrachalam: దుమ్ముగూడెం ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ ఆయా పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబర్ 30న భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 29 Sept 2026 5:20 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: అంగన్‌వాడీ ఆయా పోస్టులకు ఇంటర్య్వూలు - సీడీపీఓ విజయ కుమారి!

Bhadrachalam: దుమ్ముగూడెం ప్రాజెక్టు నందు ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకొని అర్హత సాధించిన అభ్యర్థులకు భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలో ఇంటర్వ్యూ లు నిర్వహించడం జరుగుతుందని సిడిపిఓ జెట్టి విజయ కుమారి మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

మొత్తము 105 ఖాళీలకు గాను 486 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 207 అభ్యర్థులు అనార్హులు గాను, 279 అభ్యర్థులు అర్హులు గాను గుర్తించడం జరిగిందని అన్నారు.అర్హత పొందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ కొరకు కాల్ లెటర్స్ పంపించడం జరిగిందని, వీరికి ఈనెల 30 సెప్టెంబర్ 2026 తారీఖున స్థానిక భద్రాచలం నందు మండల ప్రజా పరిషత్ నందు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు.

దుమ్ముగూడెం ప్రాజెక్టు నందు ఉన్నటువంటి భద్రాచలం మండలం మరియు దుమ్ముగూడెం మండలం వారికి విడివిడిగా ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతోందని, దుమ్ముగూడెం మండలం వారు మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం మండలం వారు సాయంత్రం 4 గంటలకు పైన తెలిపినటువంటి ఇంటర్వ్యూ ప్రదేశానికి సకాలంలో వారి ఒరిజినల్ సర్టిఫికెట్స్ , కాల్ లెటర్ మరియు ఒక జత జిరాక్స్ కాపీలతో అభ్యర్థులు హాజరు కావలసిందిగా ఆమె కోరారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem