Annapureddypalli: గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం!

Annapureddypalli: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి అఖిల్ అదృశ్యమయ్యాడు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 16 Nov 2026 12:30 PM IST
Annapureddypalli
X

Annapureddypalli: గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం!

Annapureddypalli: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థి అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది.

చండ్రుగొండ గ్రామానికి చెందిన ఇనగంటి తిరుపతి కుమారుడు ఇనగంటి అఖిల్ (17) అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ కళాశాలలో బైపీసీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 09వ తేదీన అఖిల్ యథావిధిగా ఇంటి నుండి కళాశాలకు వచ్చాడు. ఈనెల 11వ తేదీన (బుధవారం) మధ్యాహ్నం అకస్మాత్తుగా కళాశాల నుండి సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయటికి వెళ్లిపోయాడు.

నాలుగు రోజులుగా అదృశ్యమైన విద్యార్థి కోసం కుటుంబ సభ్యులు కళాశాల సిబ్బంది వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో కళాశాల ప్రిన్సిపల్ మరియు విద్యార్థి తల్లిదండ్రులు అన్నపురెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఎస్ఐ వై. విజయసింహారెడ్డి కేసు నమోదు చేసి, విద్యార్థి అదృశ్యంపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU