Khammam: ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసానే ఇందిరమ్మ బీమా లక్ష్యం!
Khammam: ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా లక్ష్యమని ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ తెలిపారు.
Khammam: ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసానే ఇందిరమ్మ బీమా లక్ష్యం!
Khammam: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, భరోసా కల్పించేందుకు కృషి చేస్తోందని ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ ఖాదర్ బాబా పేర్కొన్నారు.
ఈరోజు ఖమ్మం నగరంలోని 7వ, 9వ, 12వ డివిజన్లలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా కేంద్రాలను ఇరువురు చైర్మన్లు కలిసి సందర్శించి, ప్రజల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, ఆపద సమయంలో కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.
అనంతరం ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు. పలు డివిజన్లలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, పెన్షన్ పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సౌజన్య, సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ కామర్తపు మురళి, సేవాదళ్ అధ్యక్షులు గౌస్, పాలకుర్తి నాగేశ్వరరావు, చండ్ర శశి, తాళ్లూరి వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్లు చిరుమామిళ్ల లక్ష్మీ నాగేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు చింతల ఉపేందర్, రవికుమార్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, సంబంధిత వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.




