Julurupadu: బెండలపాడులో ఇందిరమ్మ జీవిత భీమా నమోదు.. ప్రజలకు కీలక సూచన!
Julurupadu: చండ్రుగొండ మండలం బెండలపాడులో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా నమోదు రెండో రోజు కొనసాగింది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Julurupadu: బెండలపాడులో ఇందిరమ్మ జీవిత భీమా నమోదు.. ప్రజలకు కీలక సూచన!
Julurupadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని బెండలపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా నమోదు కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. ఇందిరమ్మ జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా కమిటీ సభ్యులు బుర్ర సురేష్ పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో ఈ ప్రభుత్వం ఎంతో ప్రత్యేకమైనదన్నారు.
కుటుంబ యజమాని మరణిస్తే ఆ కుటుంబాల్లోని మిగతా వారి భద్రత కోసం ఈ బీమా ఎంతగానో దోహదపడుతుందన్నారు. కాబట్టి బెండలపాడు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలందరూ ఈ భీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
భీమ నమోదుకొచ్చిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆయన కోరారు. గ్రామపంచాయతీ పరిధిలో మొదటి రోజు 40 మంది ఇందిరమ్మ జీవిత భీమ ను నమోదు చేసుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి రోహిత్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లం కృష్ణయ్య, కంప్యూటర్ ఆపరేటర్లు నవీన్, రమ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




