Pinapaka: దుగినేపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రం ఏర్పాటు!
Pinapaka: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రానికి విశేష స్పందన లభించింది.
Pinapaka: దుగినేపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రం ఏర్పాటు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా వినుపాక మండలం దుగినేపల్లి గ్రామపంచాయతీలో నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం కల్పించనున్న నేపథ్యంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ వివరాలను నమోదు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నమోదు కేంద్రంలో గ్రామస్తులకు పథకానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ నమోదు ప్రక్రియ చేపట్టారు. గ్రామానికి చెందిన పలువురు ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిరణ్ కుమార్, ఉపసర్పంచ్ సందీప్, పంచాయతీ కార్యదర్శి, జీపీ ఓ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




