Kothagudem: డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె.. సీఐటీయూ పిలుపు
Kothagudem: న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సీఐటీయూ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రకటించింది.
Kothagudem: డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె.. సీఐటీయూ పిలుపు
Kothagudem: డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మెకు పిలుపు, సమస్యల సాధన కోసం దశల వారీ పోరాటానికి సన్నద్ధం కావాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా రమేష్ పిలుపు.. మెడికల్ అధికారులకు వినతి పత్రాలు అందజేసిన సీఐటీయూ ఆశా వర్కర్స్ - మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ అధికారులకు వినతి పత్రం సమర్పణ.
ఆశా వర్కర్లు గ్రామీణ, పట్టణ ఆరోగ్య వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేసిన భూక్యా రమేష్, ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శ, గత 20 ఏండ్లుగా రాష్ట్రంలో 28 వేల మంది ఆశా వర్కర్లు బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని గుర్తు.
ఉదయం నుండి రాత్రి వరకు ఫీల్డ్ వర్క్, ఆన్ లైన్ సర్వేలు, టార్గెట్లు, డ్యూటీలు చేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.




