Khammam: అసంపూర్తి 2BHK ఇళ్లు ఇందిరమ్మ లబ్ధిదారులకు: కలెక్టర్

Khammam: ఖమ్మం జిల్లాలో నిలిచిపోయిన రెండు పడక గదుల ఇళ్లను యథాస్థితిలో ఇందిరమ్మ లబ్ధిదారులకు కేటాయించాలని కలెక్టర్ దివాకర టి.ఎస్ అధికారులను ఆదేశించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 10 Nov 2026 2:55 PM IST
Khammam
X

Khammam: అసంపూర్తి 2BHK ఇళ్లు ఇందిరమ్మ లబ్ధిదారులకు: కలెక్టర్

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో వివిధ దశల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన రెండు పడక గదుల ఇళ్ల ను యథాస్థితిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందజేతకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. మంగళవారం క్షేత్రస్థాయిలో పలు మండలాల్లోని రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలో 30, సింగిరెడ్డిపాలెం గ్రామంలో 48, శంకరగిరి తండా గ్రామంలో 30, కూసుమంచి మండలం మల్లెపల్లి గ్రామంలో 16, ఖమ్మం అర్బన్ మండలం దంసలాపురంలో 192 అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇళ్ల నిర్మాణాలను ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో అదే స్థాయి నుంచి పూర్తి చేసుకునేందుకు అంగీకారంతో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించి వారికి కేటాయించవలసిందిగా అధికారులను ఆదేశించారు.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పూర్తిగా పారదర్శకమైన విధానాన్ని అవలంబించాలని తెలిపారు. ఇళ్ల సముదాయాల వద్ద విద్యుత్, శానిటరీ, త్రాగునీటి సరఫరా తదితర మౌళిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.

కలెక్టర్ పర్యటన సందర్భంగా హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, తహశీల్దార్ లు రాంప్రసాద్, సైదులు, విజయేందర్ రెడ్డి, జయచంద్ర, హౌజింగ్ డీఈ కె. జగ్రామ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.