Hyderabad: గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
Hyderabad: హైదరాబాద్ గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, కొత్త ఇంచార్జ్ బీఎం సందీప్ హాజరయ్యారు.
Hyderabad: గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
హైదరాబాద్: హైదరాబాద్ గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , నూతన ఇంచార్జ్, ఏఐసీసీ కార్యదర్శి బి.ఎం. సందీప్ హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.
పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాల ప్రచారం, సంస్థాగత అంశాలపై చర్చ జరిగింది. నూతన ఇంచార్జ్ బీఎం సందీప్‌కు కార్యకర్తలు, నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా వచ్చిన తెలంగాణ ఇంచార్జ్ బీఎం సందీప్ కు పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్.




