Yellandu: ఇల్లందు పోలీస్ స్టేషన్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసన!
Yellandu: ఇల్లందు పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Yellandu: ఇల్లందు పోలీస్ స్టేషన్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసన!
Yellandu: తమ కుమార్తెను ఒక వ్యక్తి మాయ మాటలతో మభ్యపెట్టిన అంశాన్ని ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కనీసం ఎటువంటి కేసు నమోదు చేయకుండా.. రాజకీయ ఒత్తిడితో తనపై గతంలో కేసు నమోదు చేశారని గోపి అనే వ్యక్తి ఇల్లందు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు.
ఈ అంశానికి సంబంధించి బండి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తనకు సహకరించాడు అన్న నెపంతో అతనిపై అతని కుటుంబ సభ్యుల పై తన కుమార్తెతో తప్పుడు కేసు పెట్టించి ఇల్లందు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించారని ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయాలని ఇల్లందు పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధానా రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.
పోలీస్ ఉన్నత అధికారులు స్పందించిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఒంటిపై పెట్రోల్ కూడా పోసుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. మా ఫిర్యాదులు పట్టించుకోరు మాపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ విషయం పై కొన్ని రోజులుగా ఏకంగా పోలీస్ స్టేషన్,డిఎస్పీ కార్యాలయం ఎదుటనే బాధితులు నిరసన వ్యక్తం చేస్తుండడం.. పోలీసుల తీరును ప్రశ్నిస్తూ ఏకంగా పెట్రోల్ తోటి తమ నిరసన కొనసాగిస్తున్న తీరు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.




