Sujatanagar: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దశదిన కర్మ సందర్భంగా 50 మందికి హెల్మెట్ల పంపిణీ!

Sujatanagar: కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపలగడ్డలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దశదిన కర్మ సందర్భంగా 50 మంది యువకులకు హెల్మెట్ల పంపిణీ. డీఎస్పీ ఆదినారాయణ నివాళి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 11 Oct 2026 7:16 PM IST
Sujatanagar
X

Sujatanagar: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దశదిన కర్మ సందర్భంగా 50 మందికి హెల్మెట్ల పంపిణీ!

Sujatanagar: సుజాతనగర్ మండలం, వేపలగడ్డకు చెందిన రుంకు సత్యనారాయణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో కొత్తగూడెం, విద్యానగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని మృతిచెందారు.

ఆయన మృతితో విషాదంలో మునిగిన తండ్రి రుంకు అప్పన్న, తల్లి హైమావతి.. హెల్మెట్ లేని కారణంగా తన కుమారుడికి జరిగిన దుర్ఘటన మరొకరికి జరగకూడదని తలంచారు.

కుటుంబ స్నేహితుల సహకారంతో కుమారుడి దశదిన కార్యక్రమం సందర్భంగా 50 మంది యువకులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ హాజరై సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి తల్లిదండ్రులు, స్నేహితులను ఓదార్చి, హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం చేయడం పట్ల అభినందించారు.

హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని డీఎస్పీ సూచించారు. మృతుడి స్నేహితుల సేవా దృక్పథం అందరికీ ఆదర్శమన్నారు.

ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ జితేందర్, టూ టౌన్ సీఐ యాసిన్, త్రీటౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM