Palvancha: పాల్వంచలో తుఫాన్ బీభత్సం.. దంతేలబోరులో నేలకొరిగిన వరి పంట!

Palvancha: పాల్వంచ మండలం దంతేలబోరులో తుఫాన్ ప్రభావంతో 34 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 4 Nov 2026 12:15 PM IST
Palvancha
X

Palvancha: పాల్వంచలో తుఫాన్ బీభత్సం.. దంతేలబోరులో నేలకొరిగిన వరి పంట!

Palvancha: తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతేలబోరు ఎస్సీ కాలనీలో వరి పంట దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. గ్రామ పరిధిలోని పలు వ్యవసాయ పొలాల్లో వరి పంట నేలకొరిగి, వర్షపు నీటిలో మునిగిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్ల వెంకటేశ్వర్లు చెందిన 9 ఎకరాలు, పండుగ నారాయణకు చెందిన 6 ఎకరాలు, పొందు రోశయ్యకు చెందిన 10 ఎకరాలు, బర్ల రోశయ్యకు చెందిన ఒక ఎకరం, బర్ల బాబుకు చెందిన ఒక ఎకరం, బర్ల అచ్చయ్యకు చెందిన 2 ఎకరాలు, చెక్క వాసుకు చెందిన ఒక ఎకరం, తమ్ముళ్ల వెంకటేశ్వర్లుకు చెందిన ఒక ఎకరం,

కారుమంచి వెంకటేశ్వర్లుకు చెందిన ఒక ఎకరం, బుసిపాక వెంకటేశ్వర్లుకు చెందిన 2 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఈ వివరాల ప్రకారం మొత్తం 34 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతులు వెల్లడించారు.

పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత రైతులకు అండగా నిలవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించినట్లు సమాచారం.

పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టం వివరాలను సేకరించి నివేదిక అందించాలని ఆదేశించినట్లు తెలిసింది. సంబంధిత అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి, అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN