Burgampahad: భారీ వర్షానికి రామాపురంలో ఇల్లు కూలి దంపతులకు గాయాలు!

Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రామాపురంలో భారీ వర్షానికి ఇంటి గోడలు కూలడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RAVI, BURGAMPAD AREA
Published on: 5 Nov 2026 8:14 AM IST
Burgampahad
X

Burgampahad: భారీ వర్షానికి రామాపురంలో ఇల్లు కూలి దంపతులకు గాయాలు!

Burgampahad: బూర్గంపాడు మండలంలోని రామాపురం గ్రామంలో నిన్న కురిసిన భారీ వర్షానికి ఓ ఇంటి గోడలు కూలిపోయిన సంఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఇంటి గోడలు ఒక్కసారిగా కూలిపోవడంతో బాధిత కుటుంబం ఆందోళనకు గురైంది.

వర్షాల కారణంగా ఇళ్లు దెబ్బతింటుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి కూలిపోయిన ఇంటిని పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA