Kothagudem: మా రోడ్డు గండి పూడ్చండి సారు.. గుర్రాలచెరువు గ్రామస్తుల ఆవేదన!

Kothagudem: గుర్రాలచెరువులో తుఫాన్ ప్రభావంతో తెగిన ప్రధాన రహదారిని వెంటనే మరమ్మత్తు చేయాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 6 Nov 2026 11:24 AM IST
Kothagudem
X

Kothagudem: మా రోడ్డు గండి పూడ్చండి సారు.. గుర్రాలచెరువు గ్రామస్తుల ఆవేదన!

Kothagudem: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మురుసు తుఫాన్ చేసిన భీభచ్చం అంత ఇంతకాదు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో గుర్రాలచెరువు ప్రధాన రహదారి ఈదుల చెరువు కాలవ దగ్గర పెద్ద గండి పడి రోడ్డు కొంచెం మాత్రమే మిగిలింది.

నిత్యం వందలాది వాహనాలు వెళ్లే రోడ్డు కోట్టుకుపోయి నలుగురోజులు గడిచిన ఇప్పటివరకు అధికారులుగాని, ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడలేదని గుర్రాలచెరువు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

ఈ రోడ్డుఫై వెనుక 8 గ్రామాలు వాళ్ళు, స్కూల్ బస్సులు, వ్యవసాయదారులు, రైతుకులు భారీగా తిరుగుతారు. ప్రస్తుతం మోటర్ సైకిల్ల్స్ వెళ్లే మార్గం మాత్రమే వుంది. అధికారులు వెంటనే స్పందిస్తే బావుంటుంది అని స్థానికులు కోరుకుంటున్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA