Palvancha: పాల్వంచ పెద్దమ్మగుడిలో వైభవంగా రుద్రహోమం
Palvancha: మాసశివరాత్రిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో రుద్రహోమం అత్యంత వైభవంగా జరిగింది.
Palvancha: పాల్వంచ పెద్దమ్మగుడిలో వైభవంగా రుద్రహోమం
పాల్వంచ: మాసశివరాత్రిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, కేశవపురం-జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి)లో శుక్రవారం ఉదయం రుద్రహోమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడింది.
దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఏ.విజయ్ కుమార్ ఆదేశాల మేరకు, ముందుగా మేళతాళాలతో, వేదమంత్రాలతో అమ్మవారి, స్వామివారి ఉత్సవమూర్తులను దేవాలయం నుండి యాగశాలకు తీసుకుని వచ్చారు. మండపారాధన, గణపతి పూజలు తదితర పూజలు జరిపిన అనంతరం రుద్రహోమం నిర్వహించి చివరన పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ రుద్రహోమంలో పాల్వంచ వాస్తవ్యులు డి. మురళీ కృష్ణ - విజయ కుమారి దంపతులు పాల్గొన్నారు. అనంతరం రుద్రహోమంలో పాల్గొన్న దంపతులకు అర్చకులు ఆశీర్వచనంతో పాటు శేషవస్త్ర ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.




