Bhadrachalam: హరిహర క్షేత్రంలో ఘనంగా నగర సంకీర్తన.. భక్తుల విశేష స్పందన!

Bhadrachalam: భద్రాచలం భద్రాద్రి హరిహర క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 16 Nov 2026 11:35 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: హరిహర క్షేత్రంలో ఘనంగా నగర సంకీర్తన.. భక్తుల విశేష స్పందన!

Bhadrachalam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల శ్రీరామ దివ్య క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా భద్రాద్రి హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక హోమాలు నిర్వహించారు.

తెల్లవారుజామున నగర సంకీర్తన కార్యక్రమం అత్యంత భయంకంగా జరిగింది. స్వాములు. ఈ యొక్క నగర సంకీర్తన కార్యక్రమంలో కన్నె స్వాములు, గంటసాములు, కత్తి స్వాములు పాల్గొన్నారు. భద్రాచలం పట్టణంలోని ఊరేగింపుగా అయ్యప్ప స్వామి భజన కీర్తనలతో సందడి నెలకొంది. కార్తీక సోమవారం సందర్భంగా 250 మంది భక్తులు అయ్యప్ప దీక్ష చేపట్టారు..

భద్రాద్రి, హరిహర క్షేత్రంలో పెరుగుతున్న అయ్యప్ప దీక్ష పరులు భద్రాచలంలోని ఇప్పటివరకు దాదాపు 3,000 మంది వరకు భక్తులు అయ్యప్ప దీక్ష చేపట్టారు.. ఎక్కువ శాతం ఎప్పుడు లేనంత విధంగా ఈ సంవత్సరం కన్నె స్వాములు అధికంగా ఉన్నారు. ఎవరైతే కన్నె స్వాములతో మాలాదారణ చేపట్టిన గురుస్వాములు ఉన్నారో వారు ఆ కన్నె స్వాములతో అయ్యప్ప దీక్ష పట్ల భక్తి శ్రేద్ధ లతో, క్రమశిక్షణతో ప్రతిరోజు శరణు ఘోష చేసే విధంగా చూడాల్సిన బాధ్యత గురుస్వామూలదే అని భద్రాద్రి హరి హరి క్షేత్ర కమిటీ వారు కోరుతున్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem