Bhadrachalam: కార్తీక బహుళ పంచమి.. భద్రాద్రిలో వైభవంగా గోదావరి దివ్య హారతులు!

Bhadrachalam: కార్తీక బహుళ పంచమి సందర్భంగా భద్రాచలం గోదావరి తీరంలో పురోహితుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గోదావరి మాతకు దివ్య హారతులు వైభవంగా జరిగాయి.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 29 Nov 2026 7:56 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: కార్తీక బహుళ పంచమి.. భద్రాద్రిలో వైభవంగా గోదావరి దివ్య హారతులు!

భద్రాచలం: భద్రాచలం దివ్య క్షేత్రంలోని పుణ్య గోదావరి స్నాన ఘట్టాల వద్ద నిర్వహిస్తున్న గోదావరి హారతి పరాభవ నామ సంవత్సరం, కార్తీక బహుళ పంచమి భక్తులకు మరియు ప్రజలకు గోదావరి మాత ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని పురోహితుల సంఘం అధ్యక్షులు రామవజల రవికుమార్ అన్నారు.

ఆదివారం సాయంత్రం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలోని గోదావరి కరకట్ట ప్రదేశాలలో జరిగిన నదీహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక బహుళ పంచమి రోజు దివ్య క్షేత్రం భద్రాద్రిలో నిర్వహిస్తున్న గోదావరి హారతి కూడా చాలా విశిష్టమైనదని, గోదావరి మాతకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఇచ్చే హారతులు వల్ల మన దేశం ఉభయ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని, ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతారని తాము చేసుకునే పనులలో లాభాలు పొందుతారని ఆయన అన్నారు.

అనంతరం పురోహితులు గోదావరి హారతి విశేషాలను మరియు కార్తీక బహుళ పంచమికి సంబంధించిన విశిష్టతను భక్తులకు తెలిపి, గణపతి పూజ, దీపోత్సవం భక్తులచే సృష్టింప చేసి, పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేసి లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహత్కార్యములో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామానుగ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందుతున్నారని ఆయన అన్నారు.

అనంతరం శాంతి మంత్ర పఠనం జరిపి రామ వజ్జల రవికుమార్, లక్ష్మీ, సత్యనారాయణ రెడ్డి దంపతులు తరఫున ప్రసాదం పంపిణీ చేయడం జరిగినదని, నదిహారతి కార్యక్రమానికి పూజా సామాగ్రి భద్రాద్రి పురోహితుల సంఘం భద్రాచలం వారు అందించారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో రవికుమార్ శర్మ, సత్య ప్రసాద్ శర్మ, రామాచార్యులు, తేజ శర్మ, చంద్రశేఖర్ శర్మ, పి ఎస్ ఎన్ రెడ్డి, వీహెచ్పీ తిరుపతిరావు, శివ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem