Kothagudem: భద్రాచలంలో వైభవంగా భద్రాద్రి కా మహారాజ్ గణేష్ కమిటీ అన్నదానం!

Kothagudem: భద్రాచలంలో ఘనంగా జరిగిన భద్రాద్రి కా మహారాజ్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.. వేలాది మంది భక్తుల హాజరు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 24 Sept 2026 7:32 PM IST
Kothagudem
X

Kothagudem: భద్రాచలంలో వైభవంగా భద్రాద్రి కా మహారాజ్ గణేష్ కమిటీ అన్నదానం!

Kothagudem: భద్రాచలం సెప్టెంబర్ 24 భద్రాచల శ్రీరామ దివ్య క్షేత్రంలో అశోక్ నగర్ కాలనీ కౌసర్ మసీద్ ప్రాంగణంలో భద్రాద్రి కా మహారాజ్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క అన్నదాన దాత ప్రముఖ ఐటీసీ కాంట్రాక్టర్ ఉంగరాల వెంకట్రావు సహకారంతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

భద్రాద్రి కా మహారాజ్ కమిటీ వ్యవస్థాపకులు కుప్పాల నాగరాజు నేతృత్వంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులందరికీ అన్నదాన మహా ప్రసాదాన్ని అన్ని రకాల వంటకాలను అందరికీ అదే విధంగా వడ్డించారు. మహా అన్నదనాన్ని విజయవాడ నుంచి ప్రత్యేక వంట మాస్టర్ లను భద్రాచలం రప్పించి గణపయ్యకు భక్తులకు ప్రత్యేక వంటకాలను పండించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. దాదాపు 3000 మందికి పైగా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem