Kothagudem: అంగన్వాడీ ఆయాలకు పెన్షన్, పెండింగ్ అద్దెలు చెల్లించాలి
Kothagudem: కొత్తగూడెంలో అంగన్వాడీ ఆయాలకు ప్రభుత్వ పెన్షన్ కల్పించాలని, ఏడాదిగా పెండింగ్లో ఉన్న కేంద్రాల అద్దెలు విడుదల చేయాలని ఏఐటీయూసీ నేత గోనె మని డిమాండ్.
Kothagudem: అంగన్వాడీ ఆయాలకు పెన్షన్, పెండింగ్ అద్దెలు చెల్లించాలి
కొత్తగూడెం: అంగన్వాడీ ఆయాలకు ప్రభుత్వ పెన్షన్ సౌకర్యం కల్పించడంతో పాటు, ఏడాదిగా పెండింగ్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల అద్దెలను తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు గోనె మని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం కొత్తగూడెంలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్లో నిర్వహించిన అసోసియేషన్ జిల్లా బాధ్యుల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అతి తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటున్న అంగన్వాడీ ఆయాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ ఆయాలుగా పనిచేస్తున్నారనే కారణంతో వారికి ప్రభుత్వ పెన్షన్ సౌకర్యం కల్పించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.
అలాగే అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు ఏడాది కాలంగా అద్దెలు చెల్లించకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భవన యజమానుల ఒత్తిడితో సిబ్బంది తమ సొంత డబ్బులతో అద్దెలు చెల్లించాల్సి వస్తోందని, ఇది వారిపై అదనపు ఆర్థిక భారంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ అద్దెలను విడుదల చేసి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఆటంకాలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు కమల, భవాని, రమ, లక్ష్మి, గుణ, నీలవేణి, షహనాజ్ తదితరులు పాల్గొన్నారు.




