Bayyaram: కొత్తపేట గౌడ సంఘం అధ్యక్షుడిగా గట్టు రమేష్ గౌడ్ ఎన్నిక!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో గౌడ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక. అధ్యక్షుడిగా గట్టు రమేష్ గౌడ్ ఎన్నిక. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Bayyaram: కొత్తపేట గౌడ సంఘం అధ్యక్షుడిగా గట్టు రమేష్ గౌడ్ ఎన్నిక!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తపేట, గంధంపల్లి, దుబ్బ గూడెం గ్రామాల గౌడ సంఘం సభ్యత్వాల సర్వ సభ్య సమావేశం 200 సంవత్సరాల చరిత్ర కలిగిన చింత చెట్టు కల్లు మండవ వద్ద జరిగింది, ఈ సమావేశంలో గౌడ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు,
ప్రతి రెండు సంవత్సరాల ఒక్కసారి నూతన కమిటీని నియమించుకోవడం ఆనవాయితీ, ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికలలో గట్టు రమేష్ గౌడ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అయితే ఇప్పటివరకు జరిగిన అన్నిమార్లు నూతన కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవంగా, ఈ మారు మాత్రం ఎన్నిక జరిగింది, ఎన్నికల్లో రమేష్ ప్యానెల్ గెలుపొందింది, ఈ సందర్భంగా అధ్యక్షుడు గట్ట రమేష్ మాట్లాడుతూ.... నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు
గౌడ సంఘం సభ్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుగుదేశాడు, గౌడ కులస్తుల ఆరాధదేవమైన కాటమయ్యకు గుడిలో దేవతలకు మొక్కు లను చెల్లించి గ్రామాలలో గౌడ కుటుంబాలని చల్లగా చూడాలని కోరుకోవడం జరిగింది ,, గౌడ సంఘం అభివృద్ధి చెందేలాగా కృషి చేస్తానని, గౌడ కులస్తులు జీవనాధారం కోసం తాడిచెట్టు ఎక్కి తాటికల్లు అమ్మగా వచ్చిన సొమ్ముతో జీవనాధారం పొందుతున్నామని,
ప్రమాదం వల్ల చెట్టుపై నుండి జారిపడిన దెబ్బలు తగిలిన, చనిపోయి కుటుంబానికి పెద్దదిక్కు కోలిపూట వల్ల జరుగుతుంది,వారికి బీమా (ఎక్స్రే )సదుపాయం లేకపోవడం వల్ల వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు,కనుక బీమా సదుపాయం కోసం నా వంతు కృషి చేస్తానని,
నా సంఘం కోసం నిరంతరం తోడ్పడతానని తెలియజేశాడు, ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కమిటీ సభ్యులు వైస్ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, సెక్రెటరీ పిల్లల మల్లికార్జున గౌడ్ ,చిర్ర శీను గౌడ్, గునిగంటి శివాజీ గౌడ్, కొండ బిక్షపతి గౌడ్, జలగం ఉపేంద్ర గౌడ్, రంగు కుమారస్వామి గౌడ్, దేశిని సాంబయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు




