Garla: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన గార్ల రైతులు!
Garla: గార్ల మండలంలో మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ భూసేకరణను నిలిపివేయాలని కోరుతూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన రైతులు, అఖిలపక్ష నాయకులు.
Garla: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన గార్ల రైతులు!
Garla: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ నిర్మాణం కోసం ఐదవ షెడ్యూల్ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో చేపడుతున్న చట్టవిరుద్ధ భూసేకరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గార్ల మండల రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు.
భూసేకరణకు సంబంధించిన జీవో నంబర్ 98/2025, జీవో నంబర్ 07/2026లను రద్దు చేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు. అదేవిధంగా, గిరిజనుల 50 ఏళ్ల కల అయిన ముల్కనూర్ వద్ద మున్నేరు రిజర్వాయర్ నిర్మాణాన్ని జీవో నంబర్ 1076/2009 పనులను ప్రారంభించి, గిరిజన ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..గిరిజనుల హక్కులు, భూములు, జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరారు, గిరిజన ప్రాంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.




