Khammam: ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా నాయకుడి అరెస్ట్!

Khammam: ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్న అంతర్జిల్లా ముఠా నాయకుడు చల్లా వెంకటేశ్వర్లును ఖమ్మం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 5 Nov 2026 7:21 AM IST
Khammam
X

Khammam: ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా నాయకుడి అరెస్ట్!

Khammam: గత 5 నెలలుగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా లోని వైరా, ఏన్కూరు, కల్లూరు, కారెపల్లి, కురవి, మహబూబాబాద్ ప్రాంతాలలోని తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నటువంటి ముఠా లోని ముగ్గురు నిందితులను చాక చక్యంగా, ఖమ్మం CCS ACP MD సర్వర్, ఇన్స్పెక్టర్ ఎస్. రాజ్ కుమార్ గౌడ్ ఆద్వర్యం లో పోలీస్ బృందాలు పట్టుకోవడం జరిగింది.

ఈ దొంగల ముఠాలోని ఇద్దరు నిందితులను 1. వేములవాడ జీవన ప్రకాష్, 2. పాయం నవీన్ లను ఇటీవల పట్టుకొని రిమాండ్ కు తరలించగా, ఈ దొంగల ముఠా నాయకుడు అయిన 3. చల్లా వెంకటేశ్వర్లు ను ఈ రోజు పట్టుకొని బంగారం, వెండి ని రికవరీ చేయడం జరిగింది. తదుపరి చర్యల నిమిత్తం వైరా స్టేషన్ కు అప్పగించడం జరిగింది.

రికవరీ చేసిన వస్తువులు:

1) ఒక హుండై కార్

2.)యాభై గ్రాముల బంగారం ఆభరణాలు

3) నాలుగు వందల గ్రాముల వెండి సామాన్లు.

ఈ ముఠా జల్సాలకు అలవాటు పడి, పగలంతా కార్ లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని రాత్రి పూట అట్టి ఇళ్ళలో చొరబడి, విలువైన బంగారం మరియు వెండి వస్తువులను దోచుకోవడం జరిగినది. ఇట్టి వస్తువులను కొన్నింటిని బయట మార్కెట్ లో అమ్ముకొని జల్సాలు చేశారు. ఈ ముఠా ను పట్టుకోవడం లో చొరవ చూపిన CCS పోలీస్ సిబ్బందిని అడిషనల్ డీసీపీ రామానుజం అభినందించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.