Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గార్లలో ఘనంగా గణపతి నిమజ్జనం!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గార్ల మండలాల్లో ఘనంగా గణపతి నిమజ్జనోత్సవం. భారీ భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసిన శోభయాత్ర.
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గార్లలో ఘనంగా గణపతి నిమజ్జనం!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారం మండలాల పరిధిలో 49 గ్రామపంచాయతీలలో గణపతిని నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, సుందరంగా అలంకరించిన వాహనాల్లో విగ్రహాలను డప్పుల చెప్పలతో మహిళల కోలాటాల మధ్య ఊరేగింపుగా తరలిచ్చి నిమజ్జనం చేశారు, రెండు మండలాలలో వివిధ గ్రామాలలో 200 వినాయక విగ్రహాలను బయ్యారం పెద్ద చెరువులో,రాంపురం పాకాల ఏటి చెక్ డ్యాం లో, పాకాల బ్రిడ్జిపై, మంగేవిరేవు బ్రిడ్జి పైన, నిమజ్జనం చేశారు, బయ్యారం పెద్ద చెరువు ,చెక్ డ్యాం, పాకాల బ్రిడ్జి దగ్గర, గార్ల బయ్యారం సిఐ రవీందర్, గార్ల ఎస్సై సాయికుమార్, బయ్యారం ఎస్ఐ ప్రశాంత్ బాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, వినాయకుని విగ్రహాల ఊరేగింపులు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలను జరిగేలాగా చూసిన పోలీసు అధికారులు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలిపిన వినాయక భక్తులు.




