Bhadrachalam: గిరిజన యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ: ఐటీడీఏ పీవో బి.రాహుల్

Bhadrachalam: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు ఉచిత భోజన, వసతితో నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 31 Oct 2026 6:30 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: గిరిజన యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ: ఐటీడీఏ పీవో బి.రాహుల్

భద్రాచలం: సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ, భద్రాచలం ఆధ్వర్యంలో ఖమ్మం మరియు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాల పరిదిలో గల గిరిజన నిరుద్యోగ యువతి యువకులకు 3 నుండి 4 నెలల పాటు యువజన శిక్షణ కేంద్రం భద్రాచలంలో ఉచిత నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

ఉచిత శిక్షణ కార్యక్రమాల వివరాలు-సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ టైలర్ మహిళలకు ఐదో తరగతి ఆపైన చదివి ఉండాలని వయసు 18 నుండి 35 సంవత్సరాల లోపు కలిగి ఉండాలని, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, సీఎంఆర్ డొమెస్టిక్ నాన్ వాయిస్ మహిళలు పురుషులకు వయసు 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉండి ఇంటర్మీడియట్ చదువుకొని ఉండాలి.

గెస్ట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటర్ అండ్ పెరి పెరల్స్ పురుషులు/ మహిళలకు వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు కలిగి ఉండి పదవ తరగతి ఆ పైన చదువుకొని ఉండాలని, డ్రోన్ సర్వీసెస్ టెక్నీషియన్ పురుషులు మహిళలకు వయస్సు 18 నుండి 35 సంవత్సరాలు కలిగి ఉండి పదో తరగతి ఆ పైన చదివి ఉండాలని ఆయన అన్నారు.

శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫాం, స్టడీ మెటిరియల్ మరియు శిక్షణ తదనంతరం సర్టిఫికేట్ అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు సంబంధిత యువజన శిక్షణ కేంద్రం YTC) భద్రాచలం నందు ఆధార్ కార్డ్, కులం, పాస్ ఫోటో, స్టడీ పత్రాలు మరియు ఆదాయ ధృవ పత్రాలతో 04/11/2026 లోగా ధరఖాస్తు చేసుకోగలరని ఆయన కోరుతూ పూర్తి సమాచారం కొరకు 9347466615, 9441390232 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem