Khammam: అయ్యప్ప స్వాములకు ఉచిత మెగా వైద్య శిబిరం.. 261 మందికి పరీక్షలు!
Khammam: ఖమ్మం శ్రీనివాస నగర్ అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో 261 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Khammam: అయ్యప్ప స్వాములకు ఉచిత మెగా వైద్య శిబిరం.. 261 మందికి పరీక్షలు!
Khammam: ఖమ్మం జిల్లా అయ్యప్ప స్వాముల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఖమ్మం నగరంలోని శ్రీనివాస నగర్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాల యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శ్రీ శాస్తా దేవస్థానం. శ్రీ అయ్యప్ప అన్నప్రసాద వితరణ బృం దం ఆధ్వర్యంలో, జంగాల రాజేశ్వర రావుకు చెందిన సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ సహకారంతో, సాయిరాం హాస్పిటల్స్ భాగస్వామ్యంతో ఈ శిబి రాన్ని నిర్వహించారు.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన వైద్య శిబిరం మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగింది. మొత్తం 261 మంది వైద్య పరీక్షలు చేయించుకొని నిపుణుల నుంచి ఆరోగ్య సలహాలు పొందారు. ఈ శిబిరం లో వివిధ వైద్య విభాగాలకు చెందిన తొమ్మిది మంది వైద్య నిపు ణులు, న్యూట్రిషనిస్ట్ పాల్గొని
సేవలందిం చారు. జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, డయాబెటాలజీ, ఆర్థో పెడిక్స్, నెఫ్రాలజీ, న్యూరో సైకియాట్రీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగుల ఆరోగ్య సమస్యలను తెలుసుకొని అవస రమైన వైద్య సూచనలు అందించారు.
వైద్య శిబిరంలో డాక్టర్ సునీల్ కుమా ర్ ప్రియాంక డాక్టర్ కార్తీక్ రెడ్డి ఆర్థోపెడిక్), డాక్టర్ వెంకటేష్ పున్న డాక్టర్ విజేశ్ వర్మ, డాక్టర్ దివ్యరెడ్డికండి. డాక్టర్ తరుణ్ సాయి ఇ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) పాల్గొన్నారు. లాపరోన్ స్కోపిక్, రోబోటిక్ జీఐ సర్జరీ నిపుణుడిగా డాక్టర్ తరుణ్ సాయి సేవలందించగా, న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఖార్గవిశివలంకకూ డా శిబిరంలో పాల్గొని పోషకాహారంపై అందించారు. ఈ సూచనలు
సందర్భంగా ఉచితంగా పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రక్తంలో చక్కెర స్థాయిని తెలుసుకునేందుకు జీఆర్బీఎస్ పరీక్షలు, ఎముకల పటిష్టతను అంచనా వేసే బీఎండీ పరీక్షలు, కాలేయ ఆరోగ్య పరిస్థితిని గుర్తించే ఫైబ్రోస్కాన్ పరీక్షలు నిర్వహించారు.
వీటితోపాటు సీబీపీ, క్రియాటినిన్ పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఖరీదైన వైద్య పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురాఎ దం పట్ల శిబిరానికి వచ్చిన వారు హర్షం వ్యక్తం చేశారు. శిబిరంలో నిర్వహించిన పరీక్షల వివరాలను పరిశీలిస్తే గ్యాస్ట్రో మెడిసిన్ విభాగంలో 72 మంది, జనరల్ మెడిసిన్లో 71 మంది, డయాబెటిక్ విభాగంలో 13 మంది, ఆర్థోపెడిక్ విభా గంలో 51 మంది వైద్య సేవలు పాంచారు.
కంటి వైద్య విభాగంలో 15 మం ది. నెఫ్రాలజీలో నలుగురు, సర్జికల్ ఆం కాలజీలో ఇద్దరు. న్యూరో విభాగంలో ఒకరు, జనరల్ సర్జరీలో ఒకరు, కార్డియాలజీలో ఒకరు, డెర్మటాలజీలో ఒకరు వైద్య పరీక్షలు చేయించుకన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ జంగాల సునీల్ కుమార్ దంపతులను సన్మానించఅర్చకులు సన్మానించారు.
క్యాంపు లో మొత్తంగా 201 మంది ఓపీ సేవలను వినియోగించుకున్నారు.ఇక ప్రత్యేక పరీక్షల్లో భాగంగా 103 మందికి బోన్ మినరల్ డెన్సిటీ (బీఎండీ) పరీ క్షలు, 130 మందికి పైబ్రోస్కాన్పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కాలేయ సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశ లో గుర్తించేందుకు ఫైబ్రోస్కాన్ పరీక్ష లు ఎంతగానో ఉపయోగప డతాయని, ఎముకల ఆరోగ్యాన్ని అంచనా వేసేందుక బీఎండీ పరీక్షలు దోహదపడతాయని వైద్యులు వివరించారు.
ప్రస్తుత జీవనశైలి ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో మధుమేహము కాలేయ సంబంధిత సమస్యల 3 ఎముకల బలహీనత వంటి ఆరోగ్యసమ స్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో
ప్రయోజన కరంగా ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులపై ముందస్తు అవగా హన కల్పించడం, వ్యాధి తీవ్రత పెరగక ముందే వైద్యులను సంప్రదించేలా ప్రోత్సహించడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. ఆధ్యాత్మిక కార్యక్ర మాలతోపాటు సామాజిక సేవలో భాగంగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిం చడ అభినందనీ యమని పలువురు పే ర్కొన్నారు.
అయ్యప్ప స్వాముల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచు కొని నిర్వహించిన ఈ కార్య క్రమం ద్వారా వందలాది మందికి వైద్య సేవలు అందడం విశేషం. ఉచిత వైద్య పరీక్షలు, నిప్పణుల సలహాలు, మందుల పంపిణితో శిబిరం విజయవంతంగా ముగిసింది.




