Khammam: అక్టోబర్ 9న ఉచిత మెడికల్ క్యాంప్, బతుకమ్మ సంబరాలు!
Khammam: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఖమ్మం శ్రీరామకృష్ణ విద్యాలయంలో అక్టోబర్ 9న మహిళలకు ఉచిత వైద్య శిబిరం, బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి.
Khammam: అక్టోబర్ 9న ఉచిత మెడికల్ క్యాంప్, బతుకమ్మ సంబరాలు!
ఖమ్మం: ఖమ్మం నగరంలోని శ్రీరామకృష్ణ విద్యాలయం 60 ఏళ్ల పూర్తి అయిన సందర్భంగా ఇంటర్నేషనల్ గర్ల్స్ డే ని పునస్కరించుకుని యువతులు మహిళల కోసం ఉచిత మెడికల్ క్యాంపు మరియు బతుకమ్మ సంబరాలు జరగనున్నట్లు నిర్వాహకులు లీఫ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు & బిలిఫ్ హాస్పిటల్ ఎండీ మేడెంపుడి రమా జ్యోతి తెలిపారు.
నగరంలోని బాలికలు, యువతులకు మహిళలకు హెల్త్ చెకప్ మరియు అవేర్నెస్ పోగ్రామ్స్ నేపథ్యంలో పెద్ద ఎత్తున మహిళలు హాజరవు తారన్నారు. అక్టోబర్ 9వ తేదీన సాయంత్రం 3 గంటల నుండి 4గంటల వరకూ మెడికల్ క్యాంపు ఆతర్వాత అదే ప్రాంతంలో 5గంటల నుండి మహిళలతో బతుకమ్మ సంబురాలు జరగపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బిలిఫ్ హాస్పిటల్,లీఫ్ చారిటబుల్ ట్రస్ట్,వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ ఖమ్మం వారు సంయుక్త ముగా నిర్వహించనున్నట్లు తెలిపారు.




