Kothagudem: గణేష్ శోభాయాత్రలో తల్వార్‌తో హల్‌చల్.. నలుగురు రిమాండ్!
Kothagudem: కొత్తగూడెం సమీపంలోని గరీబ్‌పేట గణేష్ నిమజ్జన ఊరేగింపులో తల్వార్‌తో హల్‌చల్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన నలుగురిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Kothagudem: గణేష్ శోభాయాత్రలో తల్వార్‌తో హల్‌చల్.. నలుగురు రిమాండ్!
కొత్తగూడెం: గణేష్ నిమజ్జన ఊరేగింపులో మారణాయుధమైన తల్వార్‌ను ప్రదర్శిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించి, భయభ్రాంతులకు గురిచేసిన నలుగురు వ్యక్తులను కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
23.09.2026న రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో గరీబ్‌పేట గ్రామంలో గణేష్ నిమజ్జన ఊరేగింపు జరుగుతుండగా, గరీబ్‌పేటకు చెందిన చిత్తరి లింగాప్రసాద్ చేతిలో తల్వార్ పట్టుకుని జన సమూహంలో తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినట్లు పోలీసులకు సమాచారం అందింది. అతనితో పాటు పల్లె సతీష్, గోగుల నవీన్, నందతండాకు చెందిన భూక్య గణేష్లు కూడా ఊరేగింపులో పాల్గొంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగా, పోలీసులను గమనించిన నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు సంఘటనపై విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించిన అనంతరం నలుగురిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండుగల సందర్భంగా మారణాయుధాలను ప్రదర్శించడం, ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం, భయభ్రాంతులకు గురిచేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.




