Julurpadu: పడమటి నర్సాపురంలో నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభం!
Julurpadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురంలో రూ. 20 లక్షల వ్యయంతో నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులను ప్రారంభించిన సర్పంచ్, నాయకులు.
Julurpadu: పడమటి నర్సాపురంలో నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభం!
Julurpadu: పడమటి నర్సాపురం గ్రామంలో నూతన పంచాయతీ భవనం నిర్మాణం పనులు కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించిన నర్సాపురం గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మి కుమారి మాజీ ఎంపీటీసీ కాజా రమేష్ కాంగ్రెస్ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి..
పడమటి నర్సాపురం గ్రామంలో పూర్వ కాలంలో నిర్మించిన పంచాయతీ భవనం శిథిలవసతికి చేరింది. ఈ వార్త నర్సాపురం గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మలోత్ రామదాసు నాయక్ దృష్టికి తీసుకుని వెళ్లగా నూతన పంచాయతీ భవనం ఏర్పాటుకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రభుత్వం నుంచి దాదాపు 20 లక్షలు వ్యయంతో పంచాయతీ భవనం కు నిధులు మంజూరు చేయించారు.
పడమటి నర్సాపురం గ్రామ పంచాయతీ భవనం మంజూరు కావడంతో గ్రామ ప్రజలు సంతోషభావంతో హర్షం వ్యక్తం చేశారు. గ్రామలు అభివృద్ధి చెందాలంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన్న పరిపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో నే సాధ్యమని సర్పంచ్ తెలిపారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన కొనసాగిస్తుందన్నారు. గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిన్న రాజు, వెలగా తిరుపతరావు, గూడూరు శివరామయ్య, తెల్లబోయిన రామయ్య వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.




