Dammapeta: రాకేష్ రెడ్డిని గెలిపించి కెసిఆర్ గారికి కానుకగా ఇవ్వాలి!

Dammapeta: మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. రాకేష్ రెడ్డిని గెలిపించి కెసిఆర్‌కు కానుకగా ఇవ్వాలని పిలుపు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 12 Oct 2026 4:10 PM IST
Dammapeta
X

Dammapeta: రాకేష్ రెడ్డిని గెలిపించి కెసిఆర్ గారికి కానుకగా ఇవ్వాలి! 

Dammapeta: అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి MLC ఎన్నికల సన్నాహక సమావేశ అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA, BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో దమ్మపేటలోని వినాయక ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ సమావేశంలో అశ్వారావుపేట నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇంచార్జ్ ఉప్పల వెంకట రమణ గారు మరియు BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు అతిథులుగా హాజరయ్యారు.5మండలాల నాయకులు మరియు బాధ్యులు ఈ సమావేశంలో హాజరయ్యారు.

మెచ్చా గారు మాట్లాడుతూ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చెయ్యాలని.ప్రతి నాయకుడు మరియు కార్యకర్త పట్టుదలతో కృషి చేసి డిగ్రీ పూర్తి చేసిన వారిని ఓటర్లుగా నమోదు చేయించాలని. ఈ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గారిని గెలిపించి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని ఆయన అన్నారు.మండల నాయకులందరూ ఈ ప్రక్రియలో పూర్తిగా నిమగ్నం అవ్వాలని అన్నారు.

వెంకట రమణ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని.ఎక్కడ చూసినా ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నారని..మళ్ళీ కెసిఆర్ రావాలని వారు చర్చించుకుంటున్నట్టు అన్నారు.రాకేష్ రెడ్డి లాంటి మేధావులు గెలిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని.కాంగ్రెస్ వారిని నమ్మితే మన జీవితాలు బుగ్గిపాలు అవుతాయని.ఎప్పటికప్పుడు నాయకులు సమన్వయం చేసుకుంటూ పని చెయ్యాలని.రాకేష్ రెడ్డి గారు గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు.

రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో BRS విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశానని.కాంగ్రెస్ పార్టీ అధికార బలం,ఆర్థిక బలం ఉన్నందున ఓటర్ల నమోదు ప్రక్రియలో ఈమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా పని చెయ్యాలని నాయకులకు మరియు కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు,తాజా,మాజీ ప్రజా ప్రతినిధులు,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA