Raghunathapalem: కూలీల రోడ్డు ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే కందాళ దిగ్భ్రాంతి!

Raghunathapalem: రఘునాథపాలెం పంగిడి వద్ద లారీ-ఆటో ఢీ మహిళా కూలీ మృతి, 12 మందికి గాయాలు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, మెరుగైన వైద్యానికి ఆదేశం.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 2 Oct 2026 11:02 PM IST
Raghunathapalem
X

Raghunathapalem: కూలీల రోడ్డు ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే కందాళ దిగ్భ్రాంతి!

రఘునాథపాలెం:​ ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామానికి చెందిన కూలీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే విషయం తెలుసుకుని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

రఘునాథపాలెం మండలంలోని పంగిడి సమీపంలో పత్తి తీసే పనులకు వెళ్లి ఆటోలో వస్తుండగా లారీ ఢీకొని దొంతు సరుపు భారతమ్మ (55) అనే మహిళ మృతి చెందగా, మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండడం, 12 మంది కూలీలు గాయాలపాలయ్యారనే విషయం తెలుసుకుని ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం వైద్యాధికారులతో ఫోన్లో మాట్లాడి, గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.