Chintoor: మార్కెట్‌లో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి హోరెత్తించిన ప్రచారం!

Chintoor: మార్కెట్‌లో రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి విస్తృత ప్రచారం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని పిలుపు

RAJESH REDDY, CHINTOOR
Published on: 30 Oct 2026 12:34 PM IST
Chintoor
X

Chintoor: మార్కెట్‌లో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి హోరెత్తించిన ప్రచారం!

Chintoor: చింతూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. చింతూరు ప్రధాన సెంటర్ లోని కూరగాయల దుకాణాలు, వ్యాపారస్తులను రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి కలిశారు.చింతూరు ఎంపీటీసీ అభ్యర్థి సోడే కళ్యాణి,జడ్పీటీసీ అభ్యర్థి సవలం అమల తరపున ఆమె ప్రచారం నిర్వహించారు.

మార్కెట్ లోని మహిళా వ్యాపారులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామలింగారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ (చిన్ని ), శ్రీలత రెడ్డి, కళ్యాణి, సంధ్యారాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR