Burgampahad: కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో అల్లివేర్ల స్మగ్లింగ్ గుట్టురట్టు!

Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో అల్లివేర్ల స్మగ్లింగ్‌ను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు.

RAVI, BURGAMPAD AREA
Published on: 18 Nov 2026 11:22 AM IST
Burgampahad
X

Burgampahad: కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో అల్లివేర్ల స్మగ్లింగ్ గుట్టురట్టు!

Burgampahad: బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో అల్లివేర్ల అక్రమ తవ్వకాలు, రవాణాపై అటవీశాఖ అధికారులు కొరడా ఝళిపించారు. అటవీ సంపదను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.

ఈ సందర్భంగా స్మగ్లర్ల వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలతో పాటు సుమారు 50 కిలోల అల్లివేర్లను స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో అక్రమంగా అల్లివేర్ల సేకరణ, రవాణాకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అటవీ సంపదను కొల్లగొట్టే అక్రమార్కులపై నిఘా పెట్టి, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేపట్టిన చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంపదను కాపాడేందుకు ఇలాంటి దాడులను మరింత ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

అడవులను నాశనం చేస్తూ అక్రమ వ్యాపారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న ఇతర వ్యక్తుల వివరాలను కూడా వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA