Sathupalli: దోపిడీ, పీడనలేని సమసమాజ స్థాపన కోసం పోరాడాలి: సిపిఐ ఎమ్ ఎల్ మాస్ లైన్

Sathupalli: సత్తుపల్లి నీలం రామచంద్రయ్య భవనంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో అమరవీరుల వర్ధంతి సభ నిర్వహించి, పీడనలేని సమసమాజం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 10 Nov 2026 9:45 PM IST
Sathupalli
X

Sathupalli: దోపిడీ, పీడనలేని సమసమాజ స్థాపన కోసం పోరాడాలి: సిపిఐ ఎమ్ ఎల్ మాస్ లైన్

Sathupalli: ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయ సాధనకు ఉద్యమించాలి పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూకలకుంట రవి, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఏ. వెంకన్న పిలుపు నిచ్చారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న వర్ధంతి సభల్లో భాగంగా సిపిఐ ఎమ్ ఎల్ మాస్ లైన్ సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో నీలం రామచంద్రయ్య భవనం లో డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి శరత్ అధ్యక్షత న నిర్వహించిన సభ లో హాజరైన ప్రజలు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ, పాలకవర్గాల విధానాల వల్ల పేద ప్రజలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితుల నుంచి ప్రజలు బయటపడాలంటే, ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములై వ్యవస్థలో మార్పు కోసం కృషి చేయాలని అయన అన్నారు.

దేశంలోని సహజ వనరులను, ఖనిజాలు, బ్యాంకులు, ఇస్రో, ఇన్సూరెన్సు , బొగ్గు గనులు, పోస్టల్,రైల్వే,రోడ్లు, ప్రాజెక్ట్లు,విమానయానం, భూములు, పెట్రోలు బావులు, అడవులు బడా కంపెనీలకు స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు కట్టబెడుతూ ప్రజా సంపదను దోపిడీ చేస్తున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగు లకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశాడని, కాంగ్రెస్ అవినీతి పుట్టని విమర్శిస్తూ, మోడీ ప్రభుత్వంలో అవినీతి తిమింగ లాలు పెరిగిపోయినారని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు 420 వాగ్దానాలు చేసి మూడు సంవత్సరాలు అవుతున్న ప్రజలకు న్యాయం చేయలేదని కాలయాపన చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ వాళ్లకు ఉపాధి పథకం గా మారిందని, కాంగ్రెస్ కండువాళ్ళు కప్పుకున్న వారికే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాననడం శో చ నీ యమని అన్నారు.

పెట్రోల్,డీజిల్, గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజల మీద భారాలు మోపడం దారుణమన్నారు.విమర్శించారు. సోషలిస్టు సమాజ స్థాపన లక్ష్యంగా వేలాదిమంది అమరవీరులు చేసిన ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ, వారి కర్తవ్యాల కోసం పాటుపడాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంట శ్రీను, మండల నాయకులు సున్నం కృష్ణ, దుంప రాఘవులు, కుంట కృష్ణ, నేకొండ అలివేలు, వెంకటనరసమ్మ, నారాయణ, విశ్వనాధం, రాములమ్మ,జలాల్ బి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI