Bayyaram: రైతు బిడ్డ సంచలనం.. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రెండు ఉద్యోగాలు!

Bayyaram: కొత్తపేటకు చెందిన రైతు బిడ్డ రంగు సాయికిరణ్ ఐఐటీ కాన్పూర్‌లో చదువుతూనే ఎన్టీపీసీ, నాల్కో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు సాధించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 13 Oct 2026 1:54 PM IST
Bayyaram
X

Bayyaram: రైతు బిడ్డ సంచలనం.. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రెండు ఉద్యోగాలు!

Bayyaram: ఆదర్శంగా నిలిచిన వ్యవసాయ కుటుంబం. ఐఐటీ కాన్పూర్ చదువుతూనే, ఎన్టీపీసీ, నాల్కోలో ఉద్యోగాలు సాధించిన రైతు బిడ్డ.

సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఓ గ్రామీణ యువకుడు జాతీయ స్థాయిలో సత్తా చాటాడు పట్టుదలతో చదివి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాతృక సంస్థల్లో ఏకకాలంలో రెండు ఉద్యోగాలకు ఎంపికై యువతకు ఆదర్యంగా నిలిచాడు.

మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రంగు సాయికిరణ్.. కేంద్ర ప్రభుత్య మహారత్న సంస్థ ఎన్టీపీసీ (NTPC), నవరత్న సంస్థ నాలకో (NALCO)లలో ఉన్నత కొలువుల సాధించి తన గ్రామానికి, జిల్లాకు గుర్తింపు తేచ్యాడు.

తెలుగు మీడియం నుంచి ఐఐటీ దాకా.సాయికిరణ్ పదో తరగతి వరకు గ్వాలోని విశ్వశాంతి విద్యాలయంలో పూర్తిగా తెలుగు మీడియంలోనే చదివాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఖమ్మంలోని శ్రీ చైతన్య కళాశాలలో, హైదరాబాద్లోని వీఎనెఖర్ విజ్ఞానె జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (VNR VJIET)లో బీటెక్ పూర్తి చేశాడు. జాతీయ స్థాయిలో నిర్వహంచిన గేట్ (GATE) పరీక్షలో ఆల్ ఇండియా 873వ ర్యాంకు సాధించి, దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థ అయిన ఐఐటీ కాపూర్ (IIT Kanpur) లో పవర్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంటెక్ సీటు దక్కించుకున్నాడు.

చదువుతుండగానే వరించిన అవకాశాలు, ప్రస్తుతం ఐఐటీలో ఎంటెక్ పూర్తిణోకముందే, గేట్ ప్రతిభ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్టీపీసీ, నాలక్టోలలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సాయికిరణ్ ఎంపికయ్యాడు.

సాధించిన విజయాలు..

IIT కామూర్ పవర్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంటెక్ సీటు

GATE పరీక్షలో ఆల్ ఇండియా 873వ ర్యాంకు

NTPCలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం

NALCOలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం

తల్లిదండ్రుల కష్టం.. అన్నయ్యా అండదండలతోనే.

సాయికిరణ్ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ రేయింబవళ్లు కష్టపడే తల్లిదండ్రుల న్యూర్తికి తోడు, తన విద్యాభ్యాసంలో ప్రతి అడుగులోనూ అన్నయ్య అందించిన నైతిక అండదండలతోనే తాను ఈ స్థాయికి చేరినట్లు సాయికిరణ్ సంతోషం వ్యక్తం చేశాడు. తెలుగు మీడియంలో చదివి జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో పాటు, కుటుంబసభ్యుల కష్టాన్ని సాధకం చేస్తూ ఏకకాలంలో రెండు అత్యున్నత ఉద్యోగాలకు ఎంపికైన సాయికిరణ్ను గ్రామస్తులు, బంధువులు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. గ్రామీణ కుటుంబం నుంచి జాతీయ స్థాయిలో సత్తా చాటిన సాయికీరణ్ నిజంగా యువతకు ఆదర్యం.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM