Bhadrachalam: గిరిజనులకు సంక్షేమ పథకాలు అందించాలి: ఐటీడీఏ పీవో రాహుల్

Bhadrachalam: మారుమూల గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని, గిరిజన దర్బార్ అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 9 Nov 2026 3:58 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: గిరిజనులకు సంక్షేమ పథకాలు అందించాలి: ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం: ఎంతో నమ్మకంతో మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మరియు వివిధ రకాల సమస్యల గురించి గిరిజన దర్బార్లో అర్జీలు పెట్టుకునే గిరిజనులకు సంబంధిత యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

ఈరోజు ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన గిరిజన దర్బార్లో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎస్ డి సి ఆనంద్ కుమార్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఎ డి ఎం హెచ్ ఓ సైదులతో కలిసి వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించారు.

తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందే విధంగా సంబంధిత యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఈరోజు గిరిజన దర్బార్ లో ఎక్కువ శాతం దరఖాస్తులు పోడు భూముల సమస్యలు, పోడు పట్టాలలో పేర్లు మార్పు కొరకు, నూతనంగా పోడు పట్టాలు ఇప్పించుట కొరకు, రైతుబంధు రుణాలు ఇప్పించుట కొరకు, వ్యక్తిగత సమస్యలు,ఎం ఎస్ ఎం ఈ పథకము ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించుట కొరకు, కొత్తగా ఏర్పాటు చేసే మత్స్యకార సొసైటీల అనుమతి కొరకు, సౌర గిరి జల విద్యుత్ ద్వారా వ్యవసాయానికి సంబంధించి కరెంటు, బోరు, మోటారు ఇప్పించుట కొరకు, గిరిజన గ్రామాలు మరియు పంట పొలాలలో త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు.

జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత రుణాలు ఇప్పించుట కొరకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉపాధి పొందుటకు శిక్షణలు ఇప్పించుట కొరకు, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ఒంటరి మహిళలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇప్పించుట కొరకు, కిరాణా షాపులు, ఫ్యాన్సీ స్టోర్ లు, పెట్టుకోవడానికి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించుట కొరకు, గిరిజన గ్రామాలలో మంచినీటి సౌకర్యం కల్పించుట కొరకు, పై చదువులు చదవడానికి ఆర్థిక సహాయం అందించుట కొరకు మరియు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించుట కొరకు గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు.

గిరిజన దర్బార్ లో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు విడతల వారీగా ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఏపీఓ పవర్ వేణు, ఇంచార్జ్ డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ మరియు కొండరెడ్ల విభాగం అధికారి భూక్య గన్యా, ఎల్ టి ఆర్ డి టి మనిధర్, హౌసింగ్ ఏఈ హేమంత్, ఏవో సున్నం రాంబాబు, మేనేజర్ ఆదినారాయణ, జేడీఎం హరికృష్ణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ అనసూయ, హెచ్ ఈ ఓ కృష్ణయ్య, ఇతర విభాగాల సిబ్బంది నరేందర్, స్వాతి, ప్రసాద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem