Sathupally: సత్తుపల్లి పట్టణ, గ్రామాల లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ!
Sathupally: సత్తుపల్లి పట్టణం, సిద్ధారం, బెతుపల్లి గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు శుక్రవారం మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందించారు.
Sathupally: సత్తుపల్లి పట్టణ, గ్రామాల లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ!
సత్తుపల్లి: నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను ex.TGIDC చైర్మన్ గౌరవ శ్రీ మువ్వా విజయబాబు గారు అందజేశారు.
ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు:
1. తడికిముల్ల అప్పారావు గారు – సత్తుపల్లి పట్టణం, అయ్యగారిపేట – రూ.22,500.
2. నల్లంటి బసవయ్య గారు (స్వర్గీయ)– సిద్ధారం గ్రామం – రూ.45,000.
3. బొడ్డు శ్రీను గారు – సిద్ధారం గ్రామం – రూ.20,000.
4. లింగాల వెంకట రమేష్ గారు – సత్తుపల్లి పట్టణం, సిద్ధారం రోడ్డు – రూ.2,00,000.
5. ఓరుగంటి చందర్రావు గారు – బెతుపల్లి గ్రామం – రూ.36,500.
ఈ సందర్భంగా CMRF ద్వారా ఆర్థిక సహాయం అందేలా సహకరించిన మంత్రి వర్యులు గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి, ex.TGIDC చైర్మన్ గౌరవ శ్రీ మువ్వా విజయబాబు గారికి లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బెతుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు) గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి మరియు మువ్వా గారి అభిమానులు పాల్గొన్నారు.




