Aswaraopeta: నందిపాడు పంచ శివలింగాల ప్రతిష్ట మహోత్సవంలో తాటి వెంకటేశ్వర్లు!

Aswaraopeta: అశ్వారావుపేట మండలం నందిపాడులో నిర్వహించిన పంచ శివలింగాల ప్రతిష్ట మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జలగం ప్రసాదరావు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 29 Nov 2026 4:04 PM IST
Aswaraopeta
X

Aswaraopeta: నందిపాడు పంచ శివలింగాల ప్రతిష్ట మహోత్సవంలో తాటి వెంకటేశ్వర్లు!

అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం గాడ్రాల స్టేజ్ సమీపంలోని నందిపాడు గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పంచ శివలింగాల ప్రతిష్ట మహోత్సవానికి బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి జలగం ప్రసాదరావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తాటి వెంకటేశ్వర్లును సాదరంగా ఆహ్వానించి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పంచ శివలింగాలను దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పంచ శివలింగాల ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆ పరమశివుని దివ్య ఆశీస్సులు అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకున్నారు. గ్రామంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో మహోత్సవాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో వినాయకపురం మాజీ సర్పంచ్ పొట్ట రాజులు, సుంకవల్లి వీరభద్ర రావు, కాసాని చంద్రమోహన్, భూక్యా ప్రసాద్, జుజ్జురపు శ్రీరామ్ మూర్తి, రామ్ లాల్, మైలవరపు మళ్లీ,పద్దం జోగారావు, కృష్ణ, కారం ఎర్రయ్య, తాటి రాజులు, మరియు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.