Khammam: ఖమ్మం ప్రజలపై ఏసుప్రభువు చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి!

Khammam: ఖమ్మంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని, రాబోయే కరువు పరిస్థితుల నుండి ప్రజలను ఏసుప్రభువు ఆదుకోవాలని ఆకాంక్షించారు.

Sirisha Nemalikanti
Published on: 27 Nov 2026 9:50 AM IST
Khammam
X

Khammam: ఖమ్మం ప్రజలపై ఏసుప్రభువు చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి!

Khammam: రాబోయే కరువు పరిస్థితుల నుండి ప్రజలను ఆ దేవుడే ఆదుకోవాలిసెక్యులర్ వాదిగా అన్ని మతాల మనోభావాలను గౌరవిస్తాను. ప్రజలకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ఖమ్మం జిల్లాలోని క్రైస్తవ సోదరులు, దైవజనులందరికీ మాజీ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఖమ్మంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ.. ఖమ్మంలో అనేక మంది దైవజనులు నివసిస్తున్నారని, గతంలో తన చేతనైన మేరకు వారందరికీ సేవ చేయడానికి తన సర్వశక్తులు ఉపయోగించానని గర్వంగా తెలియజేశారు.

ఒక సెక్యులర్ వాదిగా, అన్ని మతాల మనోభావాలను గౌరవించే కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తిగా తాను ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటానని స్పష్టం చేశారు.రాబోయే రోజులు ఎల్ నినో ప్రభావం వల్ల కష్టమైన రోజులుగా మారనున్నాయని, కరువు పరిస్థితులు ఏర్పడి పంటలు సరిగ్గా పండకపోవచ్చని, సాగునీటికి మరియు తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సాక్షాత్తు ప్రభుత్వమే చెబుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఖమ్మం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలంటే ఆ ఏసుప్రభువు చల్లని దీవెనలు ప్రజలపై ఉండాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రాబోయే కష్టకాలంలో మానవాళికి ఎటువంటి కీడు కలగకుండా, బాధల్లో ఉన్నవారు తమ బాధలను మర్చిపోయే విధంగా ఆ ప్రభువు దీవించాలని, అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఉన్నదాంట్లోనే అందరం సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో పాస్టర్ వేముల సత్యం నాయకులు పగడాల నాగరాజు,బత్తుల మురళి తదితరులు పాల్గొన్నారు.

Sirisha Nemalikanti

Sirisha Nemalikanti