Bhadrachalam: ఓటు హక్కు ప్రాధాన్యత ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి: సబ్ కలెక్టర్
Bhadrachalam: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి విద్యార్థి తెలుసుకొని 18 ఏళ్లు నిండగానే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సూచించారు.
Bhadrachalam: ఓటు హక్కు ప్రాధాన్యత ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి: సబ్ కలెక్టర్
భద్రాచలం: భద్రాచలం ప్రతి మనిషికి సమాజంలో గుర్తింపు ఉండడానికి ఓటు హక్కు తప్పనిసరి అని ఓటు లేకపోతే మనిషి బ్రతికి ఉన్న విలువ లేదని అటువంటి ఓటు విలువ మరియు ఓటు యొక్క ప్రాధాన్యత బాల్యం నుండే విద్యార్థులు తెలుసుకొని యుక్త వయసు రాగానే ఓటరు జాబితాలో తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు.
ఈరోజు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ఎన్నికల అక్షరాస్యత క్లబ్ ఆధ్వర్యంలో బాల బాలికలకు ఓటు హక్కు పై ప్రాధాన్యత మరియు అవగాహన కలిగించడానికి 119 భద్రాచలం నియోజకవర్గంలోని ఎన్నికల నమోదు కార్యాలయంలో వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మృనాల్ శ్రేష్ట మాట్లాడుతూ ఓటు అనేది ప్రతి మనిషికి తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఓటరు జాబితాలో పేరు లేకపోతే సమాజంలో ఎటువంటి విలువలు మరియు ప్రభుత్వం నుంచి రావలసిన సంక్షేమ పథకాలు వంటి ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి అనార్హులవుతారని అందుకు ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని అందుకు చిన్నారులు తప్పనిసరిగా ఓటు విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసే విధంగా చేయాలని అన్నారు.
అనంతరం ఓటు హక్కు ప్రాధాన్యత గురించి విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన క్విజ్ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులను అందించి ఓటు హక్కు ప్రాధాన్యత అవగాహన కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నందుకు ఆయన విద్యార్థులను అభినందించారు.




