Khammam: పేకాట స్థావరంపై ఎన్కూరు పోలీసుల మెరుపు దాడి.. ఐదుగురిపై కేసు!

Khammam: కల్లూరు ఏసీపీ సాంబరాజు ఆదేశాలతో ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం భగవాన్ నాయక్ తండా శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 24 Nov 2026 10:15 PM IST
Khammam
X

Khammam: పేకాట స్థావరంపై ఎన్కూరు పోలీసుల మెరుపు దాడి.. ఐదుగురిపై కేసు!

ఖమ్మం: ఏసీపీ కల్లూరు శ్రీ సాంబరాజు గారి ఆదేశాల మేరకు ఎన్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవాన్ నాయక్ తండా గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎన్కూరు పోలీసులు పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు.

ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా, పోలీసులను గమనించిన నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోగా, గుగులోతు రమేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది.

నిందితుల వివరాలు:

1. గుగులోతు రమేష్, తండ్రి గోపి, వయస్సు 46 సంవత్సరాలు, కులం లంబాడీ, వృత్తి కూలీ, నివాసం భగవాన్ నాయక్ తండా, ఎన్కూరు మండలం.

2. బానోత్ కళ్యాణ్ కుమార్, తండ్రి కృష్ణ, వయస్సు 30 సంవత్సరాలు, కులం లంబాడీ, వృత్తి వ్యవసాయం, నివాసం భగవాన్ నాయక్ తండా, ఎన్కూరు మండలం.

3. బానోత్ కృష్ణ, తండ్రి హెమల్లా, వయస్సు 41 సంవత్సరాలు, కులం లంబాడీ, వృత్తి వ్యవసాయం, నివాసం భగవాన్ నాయక్ తండా, ఎన్కూరు మండలం.

4. బానోత్ రాజా, తండ్రి కృష్ణ, వయస్సు 33 సంవత్సరాలు, కులం లంబాడీ, వృత్తి వ్యవసాయం, నివాసం భగవాన్ నాయక్ తండా, ఎన్కూరు మండలం.

5. ధారవత్ శంకర్, తండ్రి లక్ష్మా, వయస్సు 45 సంవత్సరాలు, కులం లంబాడీ, వృత్తి వ్యవసాయం, నివాసం భగవాన్ నాయక్ తండా, ఎన్కూరు మండలం.

సీజ్ చేసిన వస్తువులు:

1. ఒక ద్విచక్ర వాహనం.

2. రెండు సెల్‌ఫోన్లు.

3. నగదు రూ.7,500/-.

పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ కల్లూరు శ్రీ సాంబరాజు గారు హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.