Chandrugonda: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవతో విద్యుత్ సమస్యకు పరిష్కారం!

Chandrugonda: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవతో చండ్రుగొండ 3వ వార్డులో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు. సమస్య తీర్చినందుకు వార్డు సభ్యుడు ఇమ్రాన్ కృతజ్ఞతలు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 19 Oct 2026 11:34 AM IST
Chandrugonda
X

Chandrugonda: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవతో విద్యుత్ సమస్యకు పరిష్కారం!

Chandrugonda: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాలు, చొరవతో చండ్రుగొండ గ్రామంలోని 3వ వార్డులో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు చేపట్టారు. గత ఎన్నో ఏళ్లుగా విద్యుత్ స్తంభాలు లేక స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన 3వ వార్డు సభ్యుడు SK. ఇమ్రాన్ ఈ సమస్యను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్న దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజల సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే చొరవతో స్పందించిన అధికారులు నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు చేపట్టారు.

ఈ క్రమంలో 3వ వార్డు సభ్యుడు SK. ఇమ్రాన్ స్వయంగా దగ్గరుండి, స్థానిక వార్డు సభ్యులు, ప్రజలతో చర్చించి వారి సౌకర్యానికి అనుగుణంగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయిస్తున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా విద్యుత్ స్తంభాలు లేక ఇబ్బందులు పడుతున్న స్థానికులకు ఊరట లభించనుంది.

ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా SK. ఇమ్రాన్ తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించి పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి, చంద్రుగొండ మండల మైనారిటీ అధ్యక్షులు SK. అన్వర్, మండల మైనారిటీ నాయకులు SK. వసీం పాషా, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU