Julurpadu: రాంరెడ్డి సర్వోత్తం రెడ్డిని గెలిపించండి: సుమంత్
Julurpadu: ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని దుద్దుకూరి సుమంత్ కోరారు.
Julurpadu: రాంరెడ్డి సర్వోత్తం రెడ్డిని గెలిపించండి: సుమంత్
Julurpadu: త్వరలో జరగబోయే ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు తో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు దుద్దుకూరి సుమంత్ కోరారు. ఈరోజు ఎన్నికల్లో భాగంగా గ్రాడ్యుయేట్ MLC ఓటు ఎన్రోల్మెంట్ లో భాగంగా జూలూరుపాడు మండలం, గుండెపుడి క్లస్టర్ లో జరుగుతున్న ఎన్రోల్మెంట్ పక్రియను సుమంత్ పరిశీలించారు.
ఈ సందర్బంగా సుమంత్ మాట్లాడుతూవైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు ఈ క్లస్టర్ లో నమోదు కేంద్రం ఏర్పాటు చేశామన్నారు., గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున నమోదు చేసుకుంటున్నారని సుమంత్ అన్నారు. అదే విధంగా ఈ ప్రాంత ముద్దు బిడ్డ రాంరెడ్డి కుటుంబ వారసుడు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి మంచి విద్యా వంతుడు, గొప్ప ఉద్యోగం వదిలి రాజకీయాలలోకి ప్రజా సేవ చేయటానికి వచ్చారన్నారు.
అదే విధంగా గ్రాడ్యుయేట్స్ సమస్యల పై అవగాహన ఉన్న వ్యక్తి సర్వోత్తం రెడ్డి అని సుమంత్ అన్నారు. కాబట్టి మూడు జిల్లాల గ్రాడ్యుయేట్స్ అందరు సర్వోత్తం రెడ్డి గారికి అండగా నిలిచి మొదటి ప్రాధాన్యత ఓటు తో గెపించాలని కోరారు.
అదేవిధంగా 2023లోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని సుమంత్ కోరారు. ఈ కార్యక్రమం లో గుండెపుడి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గాదె కృష్ణయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంచర్ల హరీష్, భూక్యా నర్సింహారావు, పూనెం నవీన్, ఈసం శివాజీ, ఆపరేటర్స్ తదితరులు పాల్గొన్నారు.




