Karivarigudem: కరివారిగూడెంలో తీరిన తాగునీటి సమస్య!
Karivarigudem: కరివారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీలో మోటార్ బిగించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు.
Karivarigudem: కరివారిగూడెంలో తీరిన తాగునీటి సమస్య!
Karivarigudem: కరివారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీలో ఎదురవుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కాలనీ ప్రజల నీటి ఇబ్బందులను తొలగించేందుకు గాను పంచాయతీ పాలకవర్గం, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని మోటార్‌ను బిగించారు.
ఈ మోటార్‌ను స్థానిక వాటర్ ట్యాంక్‌కు అనుసంధానం చేయడం ద్వారా కాలనీలోని ప్రతి ఇంటికీ నిరంతరాయంగా సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోడ దుర్గ భీమారావు, ఉప సర్పంచ్ వీర్ల నరసింహారావు, పంచాయతీ కార్యదర్శి ఆర్. సత్యనారాయణతో పాటు స్థానిక వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, గ్రామాభివృద్ధికి శ్రమిస్తామని హామీ ఇచ్చారు. నీటి సమస్య తీరడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




