Khammam: మహిళా స్వయం ఉపాధికి కాంగ్రెస్ అండ: డాక్టర్ తుమ్మల యుగంధర్!
Khammam: ఖమ్మం 19వ డివిజన్‌లో కుట్టు మిషన్ల పంపిణీ జన శిక్షణ్ సంస్థాన్ ఆధ్వర్యంలో మహిళలకు సర్టిఫికెట్లు అందజేసిన కాంగ్రెస్ రాష్ట్ర నేత డాక్టర్ తుమ్మల యుగంధర్.
Khammam: మహిళా స్వయం ఉపాధికి కాంగ్రెస్ అండ: డాక్టర్ తుమ్మల యుగంధర్!
ఖమ్మం, సెప్టెంబర్ 29: స్థానిక 19వ డివిజన్‌లో జన శిక్షణ్ సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టైలరింగ్, బ్యూటిషన్ శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆయన సర్టిఫికెట్లను అందజేశారు.
అనంతరం డాక్టర్ తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో సోదరీమణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుపాకుల ఎలగొండ స్వామి, కమర్తపు మురళీ, ఝాన్సీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్యతో పాటు స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




