Khammam: ఖమ్మం 18వ డివిజన్ అయ్యప్ప పడి పూజలో తుమ్మల యుగంధర్!

Khammam: ఖమ్మం 18వ డివిజన్‌లో బుధవారం జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజ, మహా అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 25 Nov 2026 4:25 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం 18వ డివిజన్ అయ్యప్ప పడి పూజలో తుమ్మల యుగంధర్!

ఖమ్మం: ఈరోజు స్థానిక 18వ డివిజన్ లో జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ గారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ గారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు,ఎంతో భక్తి శ్రద్ధలతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్ పూవాళ్ళ దుర్గా ప్రసాద్ గారు, వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ యారగర్ల హనుమంతరావు గారు, ఖమ్మం అర్బన్ డిసిసి అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి గారు, మాజీ మేయర్ పునుకొల్లు నీరజ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తుపాకుల యలగొండస్వామి గారు, మందడపు మనోహర్ గారు,18 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుకూరి ఉపేందర్ గారు, తుపాకుల శ్రీను గారు, డీసీసీ కార్యవర్గ సభ్యులు కూరపాటి ఉదయ్ సుమన్ గారు,తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.