Pinapaka: పగిడేరులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఇంటింటి ప్రచారం!
Pinapaka: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మణుగూరు మండలం పగిడేరులో నవంబర్ 19న ప్రారంభమయ్యే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Pinapaka: పగిడేరులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఇంటింటి ప్రచారం!
పినపాక: పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు... మణుగూరు మండలం, పగిడేరు గ్రామపంచాయతీ పరిధిలో నవంబర్ 19 భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదినం సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట నియోజకవర్గంలో ప్రారంభించబోవు "ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా" పథకం గురించి ఇంటింటికి ప్రచారం చేస్తూ పథకం యొక్క వివరాలను ప్రజలకు తెలియజేస్తున్న.
కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు పిరునాకి నవీన్, సమితి సింగారం గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, ఏఎంసీ డైరెక్టర్ లోడిగ సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్ గుండగాని నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మిశెట్టి సాంబ, పగిడేరు మాజీ సర్పంచ్ తాటి బిక్షం, కుంజ రంగయ్య, పగిడేరు గ్రామ శాఖ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




