Kothagudem: కొత్తగూడెం జీజీహెచ్‌లో వ్యక్తికి విజయవంతమైన శస్త్రచికిత్స!
Kothagudem: కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పదునైన వస్తువుతో దాడికి గురైన వ్యక్తికి విజయవంతంగా అత్యవసర శస్త్రచికిత్స చేసిన వైద్యులు. ప్రాణాపాయం తప్పింది.
Kothagudem: కొత్తగూడెం జీజీహెచ్‌లో వ్యక్తికి విజయవంతమైన శస్త్రచికిత్స!
Kothagudem: పదునైన వస్తువుతో దాడికి గురై తీవ్ర గాయాలపాలైన 45 ఏళ్ల వ్యక్తికి కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH)లో వైద్యులు విజయవంతంగా అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. ముఖం, మెడ, కుడి చెవి ప్రాంతాల్లో లోతైన గాయాలతో ఆసుపత్రికి చేరుకున్న బాధితుడికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో తీవ్ర గాయాలతో బాధితుడు GGH క్యాజువాలిటీకి చేరుకున్నాడు. వైద్యులు వెంటనే అత్యవసర వైద్య సేవలు ప్రారంభించి గాయాల తీవ్రతను పరిశీలించారు. సీనియర్ రెసిడెంట్ డా. ఫరూక్, స్టాఫ్ నర్సుల సహకారంతో లోకల్ అనస్తీషియా కింద గాయాలకు కుట్లు వేయడంతో పాటు కుడి చెవికి రిపేర్ చేశారు.
ఈ చికిత్సలో డా. రమేష్, అనస్థీషియా విభాగం వైద్యులు, ఇతర సిబ్బంది కీలకంగా పాల్గొన్నారు. శస్త్రచికిత్స అనంతరం అవసరమైన క్రిటికల్ కేర్‌ను కూడా అందించారు.
చీఫ్ సర్జన్, జనరల్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రాంప్రకాష్ చిటిమళ్ల పర్యవేక్షణలో వైద్య బృందం సమన్వయంతో అత్యవసర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
క్లిష్ట పరిస్థితుల్లో అత్యవసర శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యులు, అనస్థీషియా విభాగం, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బందిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాధామోహన్ అభినందించారు.
అత్యవసర పరిస్థితుల్లో క్లిష్టమైన శస్త్రచికిత్సలు, క్రిటికల్ కేర్ సేవలను సమర్థవంతంగా అందించేందుకు అవసరమైన వైద్య వసతులను బలోపేతం చేయడంలో సహకరిస్తున్న జిల్లా కలెక్టర్ అంకిత్‌కు GGH తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




