Bhadrachalam: ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి: సబ్ కలెక్టర్!
Bhadrachalam: నవంబర్ 30 సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి డివిజన్ అధికారులు సకాలంలో హాజరు కావాలని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆదేశించారు.
Bhadrachalam: ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి: సబ్ కలెక్టర్!
భద్రాచలం: నవంబర్ 30వ తేదీ సోమవారం నాడు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల డివిజన్ అధికారులు సకాలంలో హాజరుకావాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు.ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
డివిజన్ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ కోరారు.




