Khammam: ఘనంగా ముగిసిన జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్: ఖమ్మం

Khammam: ఖమ్మం కవిత డిగ్రీ కళాశాలలో మై భారత్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 10 Nov 2026 9:30 PM IST
Khammam
X

Khammam: ఘనంగా ముగిసిన జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్: ఖమ్మం

ఖమ్మం: భారత ప్రభుత్వ యువజన సర్వీసులు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, మై భారత్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిస్టిక్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ టి. సునీల్ రెడ్డి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎన్. మాధవి, పాల్గొని ముందుగా వీరు వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సునీల్ రెడ్డి మాట్లాడుతూ దేశ యువత మాదకద్రవ్యాల (డ్రగ్స్) బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్. మాధవి మాట్లాడుతూ యువత తమ ఆలోచనలు, అభిప్రాయాలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తపరిచేందుకు ఈ కార్యక్రమం ఒక మంచి వేదికగా నిలుస్తుందని, చెడు వ్యాసాలకు దూరంగా ఉండాలని ఒక అడుగు ముందు ఉండి బాగా చదువుకోవాలని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ మరియు స్వామి వివేకానంద వారి పుస్తకాలు చదివితే మీ భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్@2047: 2047 నాటికి భారతదేశాన్ని తీర్చిదిద్దాలంటే, యువత ఆరోగ్యంగా మరియు డ్రగ్స్ రహితంగా ఉండటం అత్యంత కీలకమని చదువు పట్ల ఆసక్తి ఉండాలని చెప్పారు. జిల్లాస్థాయి పోటీలలో ఎండి. నదియా అర్షిణ్, కె. వెన్నెల, ఎండి. ఆయేషా తహుర, ఆయేషా తహురిన్, పి. లక్ష్మీ ప్రియా మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు.

జిల్లాస్థాయిలో మొదటి మూడు స్థానాలలో గెలుపొందిన వారు రాష్ట్రస్థాయికి ఎన్నికవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ. రమణ రావు, మేరా యువ భారత్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఎం. రాంబాబు, ఎన్.ఎస్.ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. శ్రీనివాస రావు, ఆల్ ఇండియా రేడియో & డిడి న్యూస్ జిల్లా కరస్పాండెంట్ బి. రమేష్, తెలుగు ప్రొఫెసర్ డా,, ఎస్. స్పందన, అజయ్ కుమార్, మై భారత్ అకౌంట్స్ అధికారి కే. భానుచందర్ మరియు ఎన్వైవి భార్గవి, శిరీష, సుమయ్య, రాగసుధ పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.