Garla: జిల్లాలోని 18 మండలాల్లో 36 ప్రత్యేక బృందాలతో భూ రీ సర్వే ప్రక్రియ!

Garla: గార్ల మండలంలో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, భూ రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ స్నేహ శబరిష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 25 Nov 2026 4:24 PM IST
Garla
X

Garla: జిల్లాలోని 18 మండలాల్లో 36 ప్రత్యేక బృందాలతో భూ రీ సర్వే ప్రక్రియ!

Garla: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, రీ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.గోపాలపురం గ్రామంలో రీ సర్వే ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు..మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, గోపాలపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రీ సర్వే ప్రక్రియను,గార్ల గ్రామపంచాయతీ కార్యాలయలలో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే విధానం, కుటుంబాల వివరాల నమోదు, అర్హుల గుర్తింపు, సర్వే బృందాల పనితీరు తదితర అంశాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు జారీ చేశారు.

ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా సర్వే నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.రీ సర్వే నిర్వహించే సమయంలో కుటుంబ సభ్యుల వివరాలు, కుటుంబ పరిస్థితులు, సంబంధిత రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవ సమాచారాన్ని నమోదు చేయాలని తెలిపారు. సర్వేలో ఎలాంటి తప్పులు, అపోహలు, అసంపూర్ణ సమాచారం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలను మరో కుటుంబ వివరాలతో కలిపి నమోదు చేయకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు. రీ సర్వే ప్రక్రియలో గ్రామస్థుల సందేహాలను నివృత్తి చేస్తూ, పథకం ఉద్దేశ్యం, ప్రయోజనాలు, సర్వే ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలు అందించే సమాచారాన్ని ధృవీకరించి, సంబంధిత వివరాలను సక్రమంగా నమోదు చేయడం ద్వారా పథకం అమలులో పారదర్శకత పెరుగుతుందని అన్నారు.

సర్వే బృందాలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని, ఏ కుటుంబం వివరాలు నమోదు కాకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. రీ సర్వే పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి, నివేదికలను సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. సర్వే నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే (18) మండలాలకు రెండు చొప్పున 36 ప్రత్యేక టీములు పనిచేయడం జరుగుతుందని, అవసరం ఉన్నన్ని రోవర్లు అందుబాటులో ఉన్నాయని... తెలిపారు, సర్వే చేసిన రిజిస్టర్లలో నమోదు చేయాలని, భూముల యజమానులు వారి యొక్క హద్దులను నిర్ణయించే విధంగా, కర్రలు పాతాలని తెలిపారు, గ్రామపంచాయతీ అధికారులు జిపిఓ లు ముందస్తు సమాచారం రైతులకు అందించాలని సూచించారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో సర్వే ప్రక్రియ కీలకమైనదని, అర్హుల గుర్తింపులో నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేందుకు ప్రతి అధికారి, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ సర్వే శ్రీనివాసులు, గార్ల తహసిల్దార్ శారద, ఎంపీడీవో సుజాత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్వప్న, సంబంధిత శాఖల అధికారులు, సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM